టెలివిజన్ తెరపై ఎన్ని షోలు ఉన్నా.. కేబీసీ రూటే వేరు. ఆ షోను ఎవరైనా చూసి తీరాల్సిందే. తెలివి ఉంటే చాలు.. కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఎవరినైనా కోటీశ్వరుడిని చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. గుజరాత్‌కు చెందిన అన్‌మోల్ శాస్త్రి అనే 14 ఏళ్ల బాలుడు బిగ్‌బీ అమితాబ్ అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నాడు. మరో ప్రశ్నకు సమాధానం చెప్పి ఉంటే రూ.50 లక్షలు గెలుచుకునేవాడే కానీ లైఫ్ లైన్లు లేకపోవడంతో అది సాధ్యపడలేదు. అయితే అమితాబ్ మనసును మాత్రం దోచుకున్నాడు. ఈ బాలుడి తెలివికి ఫిదా అయిన KBC స్పాన్సర్ మరో రూ.5 లక్షలు బహుమతిగా ఇవ్వడంతో మొత్తం రూ.30 లక్షలను గెలుచుకున్నాడు
ఈ బుడతడికి అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టమట. భవిష్యత్‌లో ఖగోళ శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యమట. ఎప్పటికైనా నోబెల్ బహుమతిని గెలుస్తానని అన్‌మోల్ ధీమా వ్యక్తం చేశాడు. అంతే కాదండోయ్ ఈ బాలుడు ‘హౌ ఇట్ వర్క్స్’ అనే యూట్యూబ్ ఛానల్‌ను కూడా నడిపిస్తున్నాడు. దానికి తన వంతు సహకారం అందిస్తానని అమితాబ్ ఆ బాలుడికి హామీ ఇవ్వడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనం కూడా ఈ బుడ్డోడి కల నెలవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
No comments:
Post a Comment