Tuesday, 15 December 2020

‘వకీల్ సాబ్’ విడుదల ఎప్పుడంటే?


 పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ విడుదల వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఏడాది సమ్మర్‌కే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ పూర్తికాకపోవడంతో విడుదల వాయిదా పడింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీనుల విందు చేస్తుందని పవర్ స్టార్ అభిమానులు ఆశించారు. కానీ వారి ఆశ నెరవేరే అవకాశం లేదు.

ఎందుకంటే అప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాదు. 50 శాతం సీట్లకు మాత్రమే ప్రభుత్వాలు అనుమతులు జారీ చేయడంతో భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. దీంతో దిల్ రాజు కూడా పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను రిలీజ్ చేసేందుకు సాహసించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవికి విడుదల కావాల్సిన ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలవుతుందని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్, అంజలి, నివేదా థామస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది మోస్ట్ ట్వీట్ చేసిన తెలుగు సినిమాల జాబితాలో నిలవడం అభిమానులలో ఆనందాన్ని నింపింది.


No comments:

Post a Comment