2020లో అల్లు అర్జున్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది అతడు నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీకి చెందిన పాటలు ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బుట్ట బొమ్మ, రాములో రాముల పాటలు ఆలిండియా టాప్-10 మ్యూజిక్ వీడియోలలో స్థానం సంపాదించాయి.
ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో కూడా వ్యూస్ పరంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ పాటలను వెనక్కి నెట్టి తెలుగు నుంచి బన్నీ నటించిన ఒకే సినిమాలో పాటలు టాప్-10 జాబితాలో చోటు సంపాదించడం మాములు విషయం కాదు. తమన్ సంగీతం అందించిన ఈ పాటలు అందరినీ హుషారెత్తించాయి.
No comments:
Post a Comment