Monday, 14 December 2020

బాలయ్య-బోయపాటి సినిమా ఆగిపోయిందా?


‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనా ఈ సినిమా నిర్మాతల వ్యూహాన్ని మార్చేసింది. అంతా బాగుంటే 2021 సమ్మర్‌కు ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇంతలో కరోనా వైరస్ రావడం, షూటింగ్‌లు ఆగిపోవడం జరిగాయి. దీంతో ఈ సినిమా వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందానా తయారైంది.

ఇప్పటికీ ఈ సినిమాలో నటించే హీరోయిన్లు, విలన్‌లు ఎవరో క్లారిటీ రాలేదంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. తొలుత విలన్‌గా సునీల్ శెట్టి పేరును పరిశీలించారు. అనంతరం సంజయ్‌దత్, హీరో శ్రీకాంత్ పేర్లు కూడా వినబడ్డాయి. కానీ ఇప్పటివరకు విలన్ పాత్రధారిపై అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. అటు హీరోయిన్ల కోసం ఇంకా గాలింపు జరుగుతూనే ఉంది. అంజలి, సయేషా సైగల్, ప్రగ్యా జైశ్వాల్, సోనాల్ చౌహన్ పేర్లను పరిశీలించినా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఇప్పుడు పూర్ణ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ కరోనా వల్ల లెక్కలు తారుమారు కావడం, వడ్డీలు, బడ్జెట్ పెరిగిపోతుండటం వల్ల ఈ ప్రాజెక్టు మూలపడే అవకాశం ఉందని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని ఫిలింనగర్‌లో టాక్ వినపడుతోంది.

No comments:

Post a Comment