Monday, 14 December 2020

‘ఆహా’ అనిపించేలా మెగా హీరోల షో


ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఓటీటీ ‘ఆహా’ కంటెంట్ పరంగా దూసుకుపోతోంది. డిజిటల్ మీడియా వేదికపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టాక్ షోలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పటికే సుమతో ఓ టాక్ షో ప్రసారం కాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత ‘సామ్ జామ్’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో భాగంగా విజయ్ దేవరకొండ, రానా, తమన్నా, సైనా నెహ్వాల్ దంపతులతో ఇంటర్వ్యూలు చేసిన సామ్.. ఇప్పుడు ఏకంగా మెగా కాంపౌండ్‌లోని హీరోలతో ముచ్చటించింది.

ఈ వారం అల్లు అర్జున్ షో ప్రసారం కానుండగా.. క్రిస్మస్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలు ఆహా అనిపించేలా ఉంటాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి చిత్రీకరణలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రసారం కానున్న ఈ షోలు ప్రేక్షకులను ఆకట్టుకుని అధిక వ్యూస్ రాబడతామని ‘ఆహా’ మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది.


No comments:

Post a Comment