రేటింగ్: 0.5/5
ఈ ఏడాది కరోనా వైరస్ సృష్టించిన భయానక వాతావరణం గురించి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ వల్ల చాలా మంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు . ఈ పాయింట్ ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘కరోనా వైరస్’ సుదీర్ఘ లాక్ డౌన్ విరామం తర్వాత ఈరోజే (డిసెంబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా వైరస్ మొదలైన తీరు, దాని తీవ్రత, అనంతర పరిణామాలు, ప్రభుత్వాల పనితీరుపై ఈ సినిమా ‘సాగు’తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దీనిని సినిమా అనే బదులు షార్ట్ ఫిలిం అంటే బాగుంటుందేమో. కేవలం 8 పాత్రలు, ఒకే లొకేషన్‌తో ఈ సినిమా నడుస్తుంది. ఒక దశ, దిశా లేకుండా సాగిన ఈ చిత్రంలో ఎవరి పాత్ర గురించి వర్ణించలేం. కరోనా వైరస్ వస్తే ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో ఈ సినిమాలో చూస్తే నవ్వు రాక మానదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్, పతాక సన్నివేశాల గురించి చెప్పుకోకపోవడమే బెటర్.
ఒక సన్నివేశంలో ప్రభుత్వాల కారణంగానే కరోనా వైరస్ వచ్చిందని ఓ కుర్రాడు మానసిక క్షోభతో టీవీని నేలకేసి కొడతాడు. ఇదే తరహాలో మీరు ఈ సినిమా చూస్తే ఫస్ట్రేషన్‌లో మీ మొబైల్ విసిరిపడేయటం లేదా థియేటర్‌లో తెరను చింపే స్థాయికి వెళ్లే అవకాశం కూడా ఉంది. మాటలు, సంగీతం, కెమెరా పనితీరు ఇలా ఏ విభాగంలోనూ ఈ సినిమా మెప్పించలేదు.
ఫైనల్‌గా.. దేశ విదేశాలు కరోనా నివారణకు టీకా కనిపెట్టడంలో నిమగ్నమైన వేళ.. కరోనా వైరస్‌కు కళ్లు, చెవులు ఉండి ఈ సినిమా కనుక చూస్తే వారికి ఆ అవకాశం లేకుండా అదే చచ్చిపోవడం ఖాయం.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: సంధ్య 35MM (ఆర్టీసీ క్రాస్ రోడ్స్)
RGV movie First show ki velavvu Ra|Nuvvu keka ra
ReplyDelete