జూ.ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై మెరవనున్నాడు. ఇప్పటికే అతడు బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌లో హోస్ట్‌గా అదరగొట్టి ఆ షో రేటింగ్‌లను ఎక్కడికో తీసుకువెళ్లాడు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత తారక్ మరోసారి బుల్లితెరపై ఓ షో చేయబోతున్నాడు. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానుంది. అయితే ఇది టాక్ షోనా, రియాల్టీ షోనా అన్న విషయం తెలియాల్సి ఉంది. రెండు వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇప్పటికే ఈ షో షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేశారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు ఉన్న పాపులారిటీని బట్టి ఈ షో బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్‌తో గడుపుతున్న ఎన్టీఆర్ ఇటీవల ఈ షోకు డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అసలే తారక్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటుడిని బుల్లితెరపై చూద్దామని అభిమానులు ఆరాటపడుతున్నారు.
No comments:
Post a Comment