Thursday, 10 December 2020

ఐఐటీ కృష్ణమూర్తి మూవీ రివ్యూ


 రేటింగ్: 2.5/5

తెలుగులో నేరుగా ఓటీటీల్లో విడుదలైన మరో మూవీ ఐఐటీ కృష్ణమూర్తి. పలు క్రైమ్ థ్రిల్లర్లు డిజిటల్ వేదికగా సందడి చేస్తున్న ఈ సమయంలో థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన మరో సినిమా ఇది. కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

హీరో కృష్ణమూర్తి (పృథ్వీ దండమూడి) ముంబైలో ఐఐటీ చేస్తుంటాడు. ఒకరోజు తన బాబాయ్ కనిపించడంలేదని, చనిపోయి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. వారు బలమైన సాక్ష్యాలు ఉంటే కానీ నమ్మమని తేల్చి చెప్పడంతో వారిని నమ్మించడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే దీని వెనుక ఓ కంపెనీ హస్తం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు ఈ మిస్టరీ ఎలా ఛేదించారు? ఇంతకీ హీరోకు దీనికి సంబంధమేమిటి అన్నది మిగతా కథ.

క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో పలు ఆసక్తికర మలుపులు ఉత్కంఠ కలిగిస్తాయి. అయితే క్లైమాక్స్‌లోనే దానిని రివీల్ చేయడం.. మిగతా కథను ప్లాట్‌గా చెప్పడం బోరింగ్ కలిగిస్తుంది. కమెడియన్ సత్య ఉన్నా అతడు చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. అలాగే హీరోయిన్‌ మైరా జోషికి కూడా పెద్ద పాత్రేమీ దక్కలేదు. హీరోతో కొన్ని పాటలు మినహాయిస్తే ఇందులో హీరోయిన్ పాత్ర చెప్పుకోవడానికి ఏమీలేదు. సీనియర్ నటుడు బెనర్జీ, మరో సీనియర్ నటుడు ఆనంద్ తమ పరిధి మేర నటించారు. శ్రీవర్ధన్ దర్శకత్వం అక్కడక్కడా బాగున్నా అతడు ఇంకా రాటుదేలాల్సి ఉంది. 

ఈ సినిమా నిడివి గంట 50 నిమిషాలు మాత్రమే ఉండటం ప్లస్ పాయింట్. హీరో పాత్ర ఇంకా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదేమో అనిపించింది. నిడివి తక్కువే అయినా సినిమా సాగదీసి ఉన్నట్లు ఉండటం మైనస్. సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ తరహాలో ఉన్నాయి.





No comments:

Post a Comment