మెగా ఫ్యామిలీలో నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం ఇటీవల రాజస్థాన్‌లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగా కుటుంబీకులందరూ హాజరయ్యారు ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత భార్య (అన్నా లెజ్నేవా) తప్ప. అయితే మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ రెండో వివాహం కొన్నాళ్లే కిందటే జరగ్గా.. అప్పుడు హాజరై అందరినీ ఆకర్షించిన అన్నా లెజ్నేవా ఇప్పుడు నిహారిక వివాహానికి ఎందుకు రాలేదన్నదే కొందరు అభిమానుల సందేహం.
అయితే మెగా కుటుంబంలోని కొందరు సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం పవన్ భార్య అన్నా లెజ్నేవా పిల్లలతో సహా ప్రస్తుతం రష్యాలో ఉందని తెలుస్తోంది. ఆమె క్రిస్టియన్ కాబట్టి ప్రతి డిసెంబర్‌లో క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళ్లడం ఆనవాయితీ అని.. అందుకే ఆమె గత నెలలోనే రష్యా వెళ్లినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌లో లేకపోవడంతోనే ఆమె నిహారిక పెళ్లికి వెళ్లలేదట. కానీ నిహారిక వివాహానికి తమ అభిమాన హీరో పవన్ కుటుంబసమేతంగా హాజరుకాకపోవడం పవర్‌స్టార్ అభిమానులు, మెగా కాంపౌండ్ అభిమానులను కొంత అసంతృప్తికి గురిచేసిన మాట వాస్తవమే.
No comments:
Post a Comment