Wednesday, 9 December 2020

తెలుగులో మరో కొత్త ఏటీటీ.. తొలి సినిమానే ‘రొమాంటిక్’ మూవీ


తెలుగులో ప్రస్తుతం ఓటీటీ (ఓవర్ ది టాప్), ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)ల హవా నడుస్తోంది. ఓటీటీల్లో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్స్ట్, ఆహా, ఈటీవీ విన్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఏటీటీలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. తెలుగులో శ్రేయాస్ ఈటీ పేరుతో ఇప్పటికే ఓ ఏటీటీ ఉండగా ఇప్పుడు ‘ఫ్రైడే మూవీస్’ పేరుతో మరో ఏటీటీ ఈనెల 18న ప్రారంభం కానుంది.

అల్లు వారి కాంపౌండ్‌లో ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీ ఉండగా ‘ఫ్రైడే మూవీస్’ ఏటీటీ కూడా వారికి చెందిందే అని సమాచారం. ఈ ఏటీటీ ఓ రొమాంటిక్ సినిమాతో పురుడు పోసుకోబోతోంది. దేవి, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు దర్శకత్వం అందించిన ‘డర్టీ హరి’ సినిమా ఈనెల 18న ఫ్రైడే మూవీస్‌ ఏటీటీలో విడుదల కానుంది. యువ హీరో శ్రవణ్ నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా టాప్ బ్యాండ్ విడ్త్ హై క్వాలిటీతో ఫ్రైడే మూవీస్ ఏటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మొబైల్, టీవీ, టాబ్లెట్‌లలో ఈ యాప్ ద్వారా నచ్చిన సినిమాలను డబ్బులు చెల్లించి వీక్షించవచ్చు. 




No comments:

Post a Comment