Monday, 14 December 2020

యువ హీరోతో గుత్తా జ్వాల పెళ్లి


 టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్.. మల్లూవుడ్.. ఇలా ఏ భాషలో చూసినా సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించిన సమాచారం తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. టాలీవుడ్‌లో ఇటీవలే నిహారిక వివాహం గురించి సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది. నితిన్, రానా, నిఖిల్ వంటి పలు హీరోలు కూడా ఈ ఏడాదే పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. వచ్చే ఏడాది కూడా పలువురు సెలబ్రిటీల వివాహాలు జరగనున్నాయి.

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తమిళ యువ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమలో పడింది. అయితే అతడు గతంలో ఓ అమ్మాయిని పెళ్లాడి ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. తాజాగా గుత్తా జ్వాలను ప్రేమిస్తున్నాడు. వీరి వివాహం 2021 ప్రథమార్థంలో జరిగే అవకాశం ఉంది. ఇందుకు వారి ఇళ్లలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.


No comments:

Post a Comment