‘బిగ్‌బాస్-4’ ఫైనల్ ఎపిసోడ్‌పై క్లారిటీ వచ్చేసింది. చిరంజీవి లేదా మహేష్, ఎన్టీఆర్‌లలో ఒకరిని ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు నిర్వాహకులు తీసుకువస్తారన్న వార్తల నేపథ్యంలో మెగాస్టార్‌నే ఆ అవకాశం వరించింది. ఆయన బిగ్‌బాస్ ఫైనల్‌కు రావడం ఇది రెండోసారి. మూడో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. రాహుల్ సిప్లీగంజ్‌కు ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జెమినీ టీవీకి ఓ షోకు యాంకర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌కు అతిథిగా వచ్చే అవకాశం లేకపోయింది. మహేష్ కూడా ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న కారణంగా చిరంజీవితో ట్రోఫీ ఇప్పిస్తే గౌరవంగా ఉంటుందన్న ఉద్దేశంతో నిర్వాహకులు మళ్లీ ఆయనకే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్‌గా మూడు గంటల పాటు సాగనుంది. అభిజిత్ ఈ సీజన్ విన్నర్‌గా నిలుస్తాడని సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా సమాచారం అందుతోంది.
No comments:
Post a Comment