క్రమక్రమంగా తెలుగులో ఓటీటీలలో విడుదలయ్యే సినిమాల జోరు పెరుగుతోంది. త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయని వార్తలు వస్తున్నా కొందరు నిర్మాతలు ఓటీటీల ద్వారా తమ సినిమాలు విడుదల చేసి ఆదాయం పొందాలని భావిస్తున్నారు. అదే కోవలోకి నాగార్జున కొత్త చిత్రం వైల్డ్ డాగ్ చేరనుంది.
సోల్‌మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నిర్మాతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ మంచి ఆఫర్ ఇచ్చిన కారణంగా నిర్మాతలు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా దియామీర్జా నటిస్తోంది.
No comments:
Post a Comment