Thursday, 26 November 2020

మీకు సినిమాల్లో నటించాలని ఉందా?


 ఒకప్పుడు సినిమాల్లో నటించాలంటే కృష్ణానగర్, ఫిలింనగర్‌లలో కాళ్లు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చేది. కానీ డిజిటల్ మీడియా పుణ్యమా అని నటించే అవకాశం సోషల్ మీడియా ద్వారా సులభంగా వచ్చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు కొత్తగా నిర్మించే చిత్రం కోసం కొత్త నటీనటులను వెతికే పనిలో పడ్డారు. దీంతో క్యాస్టింగ్ కాల్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పోట్టారు. 

ఈ సినిమా కోసం 20-25 ఏళ్ల మగవారు, 40-50 ఏళ్ల మగవారు, 20-30 ఏళ్ల అమ్మాయి, 40-50 ఏళ్ల మహిళతో పాటు 8-15 ఏళ్ల లోపు చిన్నారి నటీనటులు కావాలని అందులో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు రెండు, మూడు క్లోజప్ ఫోటోలు, ప్రొఫైల్ వీడియో, కాంటాక్ట్ వివరాలను pmfcastingcall@gmail.comకి పంపవచ్చు. వివరాలకు 9494539770 నంబరుకు కాల్ చేయవచ్చు.


No comments:

Post a Comment