బిగ్‌బాస్ సీజన్-4 మొదట్లో అభిజిత్, అఖిల్ బాగానే మాట్లాడుకునేవారు. వీరితో మోనాల్ గజ్జర్ సాన్నిహిత్యం కూడా బాగానే ఉండేది. రాత్రి పూట అభితో పగటి పూట అఖిల్‌తో మోనాల్ తన ప్రేమ వ్యవహారం నడిపేది. దీంతో మోనాల్‌ను అందరూ ప్రేమదేశంలో టబుతో పోలుస్తూ బాగానే ట్రోలింగ్ చేసేవారు. మధ్యలో అభిజిత్, అఖిల్ మధ్య ఇగోలు రావడం, గేమ్ స్ట్రాటజీల కారణంగా మోనాల్ కూడా అఖిల్‌తోనే రాసుకుని పూసుకుని తిరిగింది.
కానీ రెండు మూడు రోజులుగా బిగ్‌బాస్ ఆటలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హారికను కెప్టెన్ చేయడంలో మోనాల్ సహకారం ఉండటంతో అఖిల్ ఆమెను దూరం పెట్టాడు. అటు మోనాల్ అమ్మగారు టాప్-5లో అభికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడంతో పాటు అభి వాళ్ల నాన్న మోనాల్‌ను పొగడటంతో అభి, మోనాల్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ పరిణామాల మధ్యలో మంగళవారం ఎపిసోడ్‌లో మోనాల్ అఖిల్‌కు సహకారం అందించి మళ్లీ అతడికి దగ్గరైంది. దీంతో మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లో ‘ప్రేమదేశం’ మొదలైంది. చివరి వరకు వీరి ఎపిసోడ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
No comments:
Post a Comment