Thursday, 26 November 2020

హైదరాబాద్‌లో ఐదు థియేటర్లు శాశ్వతంగా క్లోజ్


 లాక్‌డౌన్ కారణంగా 8 నెలలుగా మూతపడ్డ థియేటర్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలోని ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతపడనున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీ మయూరి, నారాయణగూడలోని శాంతి థియేటర్, మెహిదీపట్నంలోని అంబ థియేటర్, బహదూర్‌పురాలోని శ్రీరామ, టోలిచౌకీలోని గెలాక్సీ థియేటర్ ఈ జాబితాలో ఉన్నాయి.

లాక్‌డౌన్ కారణంగా వచ్చిన నష్టాలు తట్టుకోలేక వీటిలో కొన్ని థియేటర్లు మూతపడనుండగా మరికొన్నింటికి అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆయా థియేటర్ల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాంతి థియేటర్‌ను గోడౌన్‌గా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. మూతపడనున్న ఈ థియేటర్లతో నగర వాసులకు ఎన్నో జ్ఞాపకాలు ఉండటంతో పాటు ఆయా థియేటర్లు కొందరు హీరోలకు లక్కీ  అనే ముద్ర వేసుకున్నాయి.


1 comment: