ఎట్టకేలకు హైదరాబాద్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4 నుంచి పలు థియేటర్లు ఓపెన్ కానున్నాయి. తొలుత మల్టీప్లెక్సులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఏఎంబీ సినిమాస్, పీవీఆర్, ఏషియన్ మల్టీప్లెక్సులతో పాటు ప్రసాద్ ఐమాక్స్, టివోలి సినిమాస్, బీవీకే విజయలక్ష్మీ లాంటి థియేటర్లు టిక్కెట్ల అమ్మకాలను ఆన్‌లైన్‌లో ప్రారంభించాయి.
కొత్త తెలుగు సినిమాలేవీ విడుదల కాకపోయినా ఆయా థియేటర్లలో వార్, కనులు కనులను దోచాయంటే, సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో అర్జున్ రెడ్డి సినిమాలతో పాటు పాత హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను బట్టి కొత్త సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సాయిధరమ్‌తేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ క్రిస్మస్ పండుగకు విడుదల అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment