Monday, 7 December 2020

ఈ ఏడాది ‘టీవీ’లో సత్తా చాటిన టాప్-5 మూవీస్

 


కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రేక్షకులు వెండితెరను కాకుండా బుల్లితెరపై వినోదాన్ని ఆస్వాదించారు. దీంతో 2020లో టీవీల్లో వేసిన పలు కొత్త తెలుగు సినిమాలు మంచి టీఆర్పీలు సాధించాయి. టాప్-5 జాబితాను గమనిస్తే మహేష్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా రెండు సార్లు ఉండటం ప్రిన్స్ సత్తాను నిరూపించింది. అంతేకాకుండా ఈ ఏడాది అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమా కూడా అదే కావడం విశేషం. 

జెమినీ టీవీ ప్రసారం చేసిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకు తొలిసారి టెలికాస్ట్ సమయంలో 29.4 టీఆర్పీ వచ్చింది. బన్నీ ‘అల వైకుంఠపురంలో’23.4 టీఆర్పీతో రెండో స్థానం సాధించింది. ఈ సినిమా కూడా జెమినీలోనే ప్రసారమైంది. ‘సరిలేరు నీకెవ్వరూ’మూవీని జెమినీ టీవీ రెండో సారి టెలికాస్ట్ చేయగా 17.4 టీఆర్పీ సాధించి మూడో స్థానంలో నిలిచింది. 4వ స్థానంలో సాయిధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ నిలిచింది. స్టార్ మా టీవీ ప్రసారం చేసిన ఈ మూవీ 15.13 టీఆర్పీ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ 11.8 టీఆర్పీతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సినిమాను జెమినీ టీవీ ప్రసారం చేసింది.

No comments:

Post a Comment