థియేటర్లు మూతపడటంతో విడుదలకు నోచుకోని సినిమాలు ల్యాబ్‌లలో బిక్కుబిక్కుమంటున్నాయి. సరిగ్గా ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఓటీటీలో విడుదలైన సినిమానే ‘పెంగ్విన్. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. రిథమ్ (కీర్తి సురేష్), రఘు (లింగా) దంపతులకు పుట్టిన కుమారుడు అజయ్ కిడ్నాప్ కావడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది. జోకర్ మాస్క్ ఉన్న దొంగ అజయ్‌ను కిడ్నాప్ చేయడంతో అందరూ చనిపోయాడని భావిస్తున్న సమయంలో ఆరేళ్ల తర్వాత అజయ్ రిథమ్‌కు దొరుకుతాడు. అయితే మాటలు రాని స్థితిలో అజయ్ ఉండటంతో కిడ్నాపర్ గురించి సమాచారం దొరకదు. ఈ చిక్కుముడిని గర్భవతి అయిన రిథమ్ ఎలా విప్పింది? ఇంతకీ కిడ్నాపర్ ఎవరు? అనే అంశాలతో సినిమా ముగుస్తుంది
హైలెట్స్: తెలుగు ప్రేక్షుకులకు ఈ సినిమాలో తెలిసిన ఒకే ఒక్క నటి కీర్తి సురేష్ మాత్రమే. ఆమె ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచింది. సినిమా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుంది. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ సింపుల్ పాయింట్‌ను రెండు గంటల పాటు థ్రిల్లర్‌గా మలచడం విశేషమే. కానీ ఫస్టాఫ్‌లో ఉన్న పట్టు ద్వితీయార్థంలో కనిపించలేదు. క్లైమాక్స్ కూడా ఇటీవల వచ్చిన ఓ తెలుగు సినిమాను పోలి ఉండటమే మైనస్. అయితే సంతోష్ నారాయణ్ బీజీఎం అద్భుతంగా ఉంది. కీర్తి సురేష్ నటన ఈ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి.
చివరగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీప్రియులకు ఈ మూవీ తప్పక నచ్చుతుంది. ఈ సినిమా ఆదరణ పొందే అవకాశం ఉండటంతో పలు సినిమాలు కూడా ఓటీటీ వైపు అడుగులు వేయవచ్చు. అనుష్క ‘నిశ్శబ్ధం’ కూడా ఓటీటీలో రిలీజ్ అయితే ఆదరణ చూరగొనే అవకాశముంది.
రేటింగ్: 2.75/5.
A REVIEW WRITTEN BY NVLR
MOVIE WATCHED: AMAZON PRIME
Nice One
ReplyDeleteజోకర్ మాస్క్ కాదు.. చార్లీ చాప్లిన్ మాస్క్
ReplyDelete