Thursday, 18 June 2020

అమెజాన్ ప్రైమ్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన ‘పెంగ్విన్’ విడుదల

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ చిత్రం గురువారం (జూన్ 19) అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్ర్రైమ్‌లో డైరెక్టుగా విడుదలవుతోంది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో అతడి శిష్యుడు ఈశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. చాలా డబ్బులు వెచ్చించి ఈ సినిమాను అమెజాన్ ప్రసారం చేస్తోంది. క్రైమ్ థిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తించాయి. జోకర్ మాస్క్ మాటున హత్యలు చేసే విలన్ ఎవరో తెలుసుకోవాలని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుండటం విశేషం. ఇప్పటివరకు ఇండియాలో డజనుకు పైగా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయినా మంచి స్పందన ఏ సినిమాకు దక్కలేదు. ఈ సినిమా ఆదరణ పొందితే త్వరలోనే మరిన్ని క్రేజ్ ఉన్న సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment