Thursday, 4 October 2018

NTR BIOPIC RELEASES IN TWO PARTS

రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్’


నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NTR’ మూవీని రెండు భాగాలుగా క్రిష్ చిత్రీకరిస్తున్నాడు. ఈ మేరకు తొలి భాగానికి ‘ఎన్టీఆర్.. కథానాయకుడు’, రెండో భాగానికి ‘ఎన్టీఆర్.. ప్రజానాయకుడు’ అని టైటిళ్లు ఫిక్స్ చేశాడు. తొలి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న, రెండో భాగాన్ని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల చేయనున్నారు. చాలా తక్కువ టైమ్‌లో రెండు భాగాలను చిత్రీకరించడం ఒక ఎత్తు అయితే.. ఈ రెండింటినీ రెండు వారాల గ్యాప్‌లో విడుదల చేస్తుండటం గమనార్హం. విద్యాబాలన్, సుమంత్, రానా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా సాయికొర్రపాటి, బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

No comments:

Post a Comment