జెండా పండుగ విజేత ఎవరు?
సంక్రాంతి, దసరాల మాదిరిగా ఈ ఏడాది జెండా పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఒకే సమయంలో మూడు మీడియం సినిమాలు విడుదల కావడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ ఈ జెండా పండుగలో విజేత ఎవరు అంటే నిఖార్సైన జవాబు చెప్పలేకపోవడం విశేషం. అయితే ‘జయ జానకి నాయక’, ‘నేనే రాజు-నేనే మంత్రి’, ‘లై’ మూడు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి.
--- రానా సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చి ఆసక్తికర కథనంతో తెరకెక్కింది. రానా నటన, ఫస్టాఫ్‌లో బిగి, రెండు పాటలు, నవదీప్ పాత్ర ప్లస్ పాయింట్లుగా నిలవగా ఎంటర్‌టైనింగ్‌గా లేకపోవడం, సెకండాఫ్‌లో గ్రాఫ్ తగ్గిపోయి సోసోగా ఉండటం మైనస్ పాయింట్లుగా నిలిచాయి
--- బోయపాటి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు రోమాలను నిక్కపొరిచేలా చేయగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రకుల్ ప్రీత్ క్యూట్ లుక్స్, భారీ తారాగణం ప్లస్ పాయింట్లుగా నిలవగా బెల్లంకొండ శ్రీను తేలిపోవడం, విలనిజం పవర్‌ఫుల్‌గా లేకపోవడం మైనస్ పాయింట్లుగా నిలిచాయి
-- నితిన్ సినిమాలో ఇంటెలిజెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ట్విస్టులు, రిచ్ లుక్, నితిన్, అర్జున్‌ల నటన, దర్శకుడి ప్రతిభ ప్లస్ పాయింట్లుగా నిలవగా చివరిలో అబద్ధమని సిల్లీగా చెప్పడం, ఎంటర్‌టైనింగ్ లేకపోవడం మైనస్ పాయింట్లుగా నిలిచాయి.
ఓవరాల్‌గా మూడు సినిమాలు ఎబౌ యావరేజ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతూ ‘జయ జానకి నాయక’ బి, సి సెంటర్లలో ఎక్కువ వసూళ్లతో అప్పర్ హ్యాండ్ సాధించింది.
No comments:
Post a Comment