Wednesday, 13 September 2017

sarvanand movie will release in dasera festival

శర్వానంద్‌కు మరీ అంత టెక్కా?

హీరో శర్వానంద్‌కు టెక్కు ఎక్కువైందని టాలీవుడ్‌లో టాక్ వినపడుతోంది. దీనికి ముఖ్య కారణం అతడి చిత్రాలు ప్రతీసారి పెద్ద హీరోల చిత్రాలతో అమీతుమీకి దిగడమే. గత రెండేళ్లుగా శర్వానంద్ నటించిన ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి చిత్రాలు బడా సినిమాలతో పోటీపడి విజయం సాధించాయి. 2015లో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలతో పోటీ పడగా, ఈ ఏడాది ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో బరిలోకి దిగాడు. దీంతో ఈసారి జూ.ఎన్టీఆర్ ‘జై లవకుశ’, మహేష్‌బాబు ‘స్పైడర్’తో పోటీకి వస్తూ తన ‘మహానుభావుడు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. చూద్దాం ఈసారి కూడా అతడు సూపర్‌హిట్ సాధిస్తాడో.. లేదో..!!

No comments:

Post a Comment