Friday, 24 March 2017

Katama Rayudu Movie Review

కాటమరాయుడు రివ్యూ: అంచనాలను అందుకోని రాయుడు 
రేటింగ్: 2.5/5
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఫీల్‌గుడ్ అంటే ‘ఖుషి’, వినోదాత్మకం అంటే ‘గబ్బర్ సింగ్’, కుటుంబ కథ అంటే ‘అత్తారింటికి దారేది’ ట్రేడ్ మార్కుగా నిలిచాయి. తాజాగా వచ్చిన కాటమరాయుడు ఈ మూడు జోనర్లను అందుకోవాలని చేసిన విఫల ప్రయత్నమే. సర్దార్ గబ్బర్‌సింగ్‌తో గత ఏడాది సమ్మర్‌లో చేదు ఫలితం చవి చూసిన పవన్.. మరో సమ్మర్‌కు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కథ విషయానికి వెళ్తే కాస్త కూడా కొత్తదనం లేని కథ. వీరమ్‌లో ఏం చూసి తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారో నిర్మాతలకే తెలియాలి. హీరోయిన్ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నంలో హీరో తనకు బలమైన మాస్ బ్యాక్‌గ్రౌండ్‌ను వదులుకోవడమే ఈ సినిమా మూలకథ. అయితే ఇందులో రొమాంటిక్, పాటలు పండకపోవడమే ఈ సినిమాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి.
నటీనటుల విషయానికి వస్తే పైన చెప్పుకున్న విధంగా ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల్లోని ఇమిటేషన్లనే పవన్ మరోసారి నమ్ముకున్నాడు. అది ఈ సినిమాలో స్పష్టంగా కనపడుతుంది. ఖుషి నడుం సీన్, గబ్బర్ సింగ్ మ్యానరిజం, అత్తారింటికి దారేది సెంటిమెంట్‌ను కలగాపులగం చేశారు. శృతిహాసన్ ఇందులో నటించడానికేం లేదు. సినిమాకు బలమైన ప్రతినాయకుడి ప్లాట్ బలంగా లేకపోవడంతో సినిమా తేలిపోయింది. 
సాంకేతికవర్గం విషయానికొస్తే గోపాల గోపాల ఫేం డాలీ అక్కడక్కడా తన మార్క్ చూపించినా ఓవరాల్‌గా కథా విషయంలో రాంగ్ రూట్ పట్టాడు. అనూప్ రూబెన్స్ పాటల్లో ఒకట్రెండు అలరించినా అవి కూడా అంతగా ఊపు మాత్రం తేలేదన్నది అక్షరసత్యం. క్వాలిటీ పరంగా సినిమా బాగానే కనిపించింది. తెరనిండా నటులున్నా ఏదో లేని వెలితి కనిపించింది. ఓవరాల్‌గా పవన్ పంచెకట్టు, రావురమేష్ కామెడీ బాగానే ఉన్నా బిలో యావరేజ్ స్థాయిలో నిలిచింది.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: పీవీఆర్-ఆర్‌కే సినీప్లెక్స్ (బంజారాహిల్స్)

No comments:

Post a Comment