Friday, 17 February 2017

Ghazi Movie Review

ఘాజీ రివ్యూ: తెలుగు సినీ చరిత్రలో కొత్త పేజీ
రేటింగ్: 3.5/5
ఇటీవల బాలీవుడ్‌లోనే జీవితచరిత్రలు తెరకెక్కించడం చూస్తున్నాం. ఆ కోవలోకి మరో సినిమా కూడా చేరింది. కాకపోతే ఈ సారి అందులో తెలుగు నటుడు ఉండటం విశేషం. భారత నావికాదళానికి చెందిన ఒక మిస్టరీని దర్శకుడు చెప్పిన తీరు అద్భుతం.

ఇక కథలోకి వెళ్తే 1971లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ వాతావరణంతో మొదలవుతుంది. భారత్‌ను దెబ్బతీసేందుకు దొడ్డిదారిన ఘాజీ అనే సబ్‌మెరైన్‌ను పాక్ పంపుతుంది. దీంతో ఇండియా కూడా ఎస్-21 అనే మరో సబ్‌మెరైన్‌తో ప్రతిదాడికి దిగుతుంది. ప్రత్యర్థులపై దాడి చేసే విషయంలో భారత సబ్‌మెరైన్ దెబ్బతింటుంది. చివరకు ఘాజీని అర్జున్ అనే ఉన్నతాధికారి ఎలా ఆపాడన్నదే మిగతా కథ.

నిజంగా జరిగిన యథారగాథను తెరకెక్కించాలంటే గట్స్ ఉన్న దర్శకుడు కావాలి. కానీ నూతన దర్శకుడు ఈ కథను ఎంచుకోవడమే గొప్ప. అలాంటిది టెక్నికల్ వండర్ చేస్తే ఇంకా అద్భుతమే. అదే చేశాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రెండు గంటల 5 నిమిషాల నిడివితో తీసిన ఈ సినిమా ఎక్కడా పక్కదారి పట్టలేదు. కాకపోతే మనకు తెలియని నటులు ఉండటంతో కొన్నిచోట్ల మనదైన సినిమాలా అనిపించదు. రానా-కేకే మీనన్ ఇద్దరూ బాగా నటించారు. తాప్సీ ఉన్నంతలో ఫర్వాలేదు.

టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు దన్నుగా నిలిచింది. మది ఛాయగ్రహణం కీలకపాత్ర పోషించింది. అండర్ వాటర్‌లో తీసిన సన్నివేశాలు సూపర్బ్. కె అనే సంగీత దర్శకుడు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంలా నిలిచింది. టెక్నీషియన్స్ అందరి నుంచి దర్శకుడు మంచి ఔట్ పుట్ రాబట్టాడు.

చివరగా.. కొత్త కథలు రావడం లేదని పదే పదే ఆరోపణలు చేయకుండా వచ్చినప్పుడు వాటిని ఆదరించడం కూడా చేసి చూపించాలి. గత ఏడాది మనమంతా విషయంలో జరిగిన అన్యాయం ఈ సినిమాకు జరగకుండా చూడాలి. అన్నీ సినిమాలు కమర్షియల్ సినిమాల అనుభూతి ఇవ్వలేవు.

A REVIEW WRITTEN BY NVLR
THEARTER WATCHED: లక్ష్మీకళ (మూసాపేట)

No comments:

Post a Comment