ప్రేమమ్ వచ్చిన నెల వ్యవధిలోనే మరోసారి నాగచైతన్య మన ముందుకు వచ్చాడు. ఎప్పుడో రావాల్సిన సినిమా అయినా.. తన నటనతో మరోసారి ఇంప్రెస్ చేశాడు చైతూ. ఏమాయ చేశావె తర్వాత గౌతమ్ మీనన్ మరో రొమాంటిక్ మూవీతో మెస్మరైజ్ చేశాడు. కాకపోతే ఈ సారి థ్రిల్లింగ్ అంశాలు ఉండటమే ఈ సినిమాలో ప్రత్యేకత..
కథలోకి వెళ్తే.. స్నేహితులతో అల్లరిచిల్లరిగా గడుపుతూ ఇంజినీరింగ్ చదివే చైతూ చెల్లెలి స్నేహితురాలిని(లీలా) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు లీలాతో రోడ్ ట్రిప్ కు బయల్దేరతాడు. అకస్మాత్తుగా వీరిద్దరికీ యాక్సిడెంట్ జరుగుతుంది. తర్వాత కథలో చాలా ట్విస్టులు చోటుచేసుకుంటాయి.. ఇంతలో అది యాక్సిడెంట్ కాదు.. మర్డర్ ఎటెంప్ట్ అని తెలుస్తుంది. తర్వాత కథ ఏ మలుపు తిరిగింది.. మర్డర్ చేయాలనుకుంది ఎవరు.. సినిమాలో హీరో పేరేంటి? ఇలాంటి అంశాలన్నీ తెరపైనే చూడండి..
ప్రతి మూవీకి నటన మెరుగుపరుచుకుంటున్న చైతూ మరోసారి డిఫరెంట్ యాంగిల్స్ కూడిన పాత్రతో మనల్ని ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ లో రొమాంటిక్, సెకండాఫ్ లో యాక్షన్ సమపాళ్లలో నటించి మెస్మరైజ్ చేశాడు. తెలుగులో తొలిసారి నటించిన మంజిమా మోహన్ తన నటనతో ఆకట్టుకుంది. వీరిద్దరి తర్వాత హీరో ఫ్రెండ్ గా నటించిన మహేష్ ఆకట్టుకుంటాడు. టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో ఫొటోగ్రఫీ అదిరింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన పాటలు ఫర్వాలేదు. నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్ గా ఉంది. నిర్మాతలు సినిమాను చాలా రిచ్ గా తీశారు.హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా చక్కగా కుదరడంతో రొమాంటిక్ ట్రాక్ బాగా పండింది.
అయితే ఈసినిమాలో మైనస్ లు కూడా ఉన్నాయి. అటు పోలీసులు.. ఇటు హీరో ఇష్టానుసారం మనుషుల్ని చంపుకుంటూ వెళ్లిపోవడం.. ఎవరికీ ఏమీ కాకపోవడం.. ఎక్కడా ఒక సిస్టమ్ అన్నదే లేనట్లుగా కథ సాగిపోవడం.. మామూలుగా గౌతమ్ మీనన్ సినిమాలు లాజికల్ గా ఉంటాయి. ఇలాంటి లూప్ హోల్స్ కనిపించవు. ఇవి మినహాయిస్తే సినిమాకు వంకపెట్టడానికి ఏమీలేదు. కాకపోతే విలన్ గా చేసిన బాబా సెహగల్ ఓవర్ గా బిహేవ్ చేశాడనిపించింది. అతను కాకుండా విలన్ గా వేరొకరిని తీసుకుంటే బాగుండేది.
కొసమెరుపు: సెకండాఫ్ ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో నడిపిన దర్శకుడు క్లైమాక్స్ కు వచ్చేసరికి హీరోచేత అసలు సంగతి చెప్పించడం.. అంత మింగుడుపడని అంశంలా కనిపిస్తుంది. హీరో పేరుని కూడా చివర్లోనే చెప్పడం బాగుంది.
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: శ్రీరాములు, మూసాపేట
No comments:
Post a Comment