Friday, 28 October 2016

Heart touching short film...Sreekaram

శ్రీకారం.. ఇది షార్ట్ ఫిలిం కాదు.. ఒక భావోద్వేగం!
సాధారణంగా ఒక డాక్టర్ కొడుకు డాక్టరే కావాలి.. ఇంజినీరింగ్ కొడుకు ఇంజినీరే కావాలనుకుంటాం.. అవుతున్నారు కూడా. కానీ ఒక రైతు కొడుకు రైతు ఎందుకు కావడం లేదు? ఈ ప్రశ్నకు అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. ఆ కష్టం మాకెందుకని టక్కున సమాధానం చెప్పేస్తారు. గత పదేళ్లుగా గమనిస్తే.. పల్లెలన్నీ ఖాళీ అవుతూ అందరూ పట్నాల వైపు చూస్తున్నారన్నది సత్యం. కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో పల్లె అనే మాట మనం నిఘంటువుల్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరిగ్గా ఈ పాయింట్ ను బేస్ చేసుకుని మిస్టర్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఒక షార్ట్ ఫిలింను రూపొందించారు.. అదే శ్రీకారం అనే షార్ట్ ఫిలిం.
మిస్టర్ ప్రొడక్షన్స్ బ్యానర్ అంటే మనకు సినిమాల్లో గీతా ఆర్ట్స్.. వైజయంతి మూవీస్.. లాంటి బ్యానర్ల లాంటిదే. ఈ బ్యానర్ అంటే మనకు ప్రయాణం, పెళ్లి పుస్తకం లాంటి షార్ట్ ఫిలింలే గుర్తుకువస్తాయి. వీరు తీసిన శ్రీకారం కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇందులో ఒక యువకుడు ఇంజినీరింగ్ చదివి.. పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా వ్యవసాయం చేయాలని తపించిపోతాడు. అక్కడే ఆగకుండా ఆ ఊర్లో అందరూ వ్యవసాయమే చేయాలని భావిస్తాడు. అందుకోసం అతడు ఏం చేశాడు.. చివరికి లక్ష్యాలను సాధించాడో లేదో తెలుసుకోవాలంటే ఈ షార్ట్ ఫిలింను మీరు చూసి తెలుసుకోండి. ఈ షార్ట్ ఫిలిం లింక్ మీ కోసం..

No comments:

Post a Comment