Wednesday, 26 October 2016

Bichagadu is better than Ganatha Garage

జనతా గ్యారేజ్ కంటే బిచ్చగాడే బెటరా..???
ఎన్టీఆర్ కెరీర్ లో జనతా గ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్టే.. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ కంటెంట్ పరంగా చూసినా, హైప్ పరంగా చూసినా ఈ ఏడాది జనతా గ్యారేజ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అందరూ అంచనా వేశారు. 2016 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సరైనోడుని కూడా జనతా గ్యారేజ్ బీట్ చేస్తుందనుకున్నారు. కానీ అంచనాలు తిరగబడ్డాయి. సరైనోడు దాదాపు రూ.80 కోట్ల షేర్ రాబడితే.. జనతా గ్యారేజ్ మాత్రం 60-65 కోట్ల మధ్యే షేర్ వసూళ్లు సాధించింది. సరైనోడు చిత్రం 116 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది . నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన 110 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని సెకండ్ ప్లేస్ లో ఉన్నది. కానీ జనతా గ్యారేజ్ 39 సెంటర్లలో మాత్రమే 50 రోజులు ఆడింది.
.... ఇక్కడ కొసమెరుపు ఏంటంటే డబ్బింగ్ సినిమా బిచ్చగాడు కూడా 50కి పైగా థియేటర్లలో 50 రోజులు ఆడితే.. జనతా గ్యారేజ్ ఆ సినిమాను కూడా దాటలేకపోవడం విడ్డూరం. ఇక టీవీ టీఆర్పీల్లో కూడా బిచ్చగాడు సినిమా 18పైగా రేటింగ్ రాబట్టి టాప్-5లో నిలిస్తే.. జనతాగ్యారేజ్ కేవలం 10 టీఆర్పీ మాత్రమే రాబట్టి శాటిలైట్ పరంగానూ నిరాశపరిచింది.

No comments:

Post a Comment