పవన్ సినిమాకు అనిరుధ్ సంగీతం..
తమిళ ఇండస్ట్రీలో అనిరుధ్ అంటే ఓ సంచలనం.. కోలీవుడ్ లో చాలా పెద్ద సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించాడు. కానీ తెలుగులోనే ఇప్పటివరకు ఒక్కసినిమా కూడా చేయలేదు. గతంలో రామ్ చరణ్ బ్రూస్ లీ, ధృవ సినిమాలకు పనిచేసే అవకాశం వచ్చినా వాటిని అనిరుధ్ వదులుకున్నాడు. త్రివిక్రమ్ తీసిన అ..ఆ సినిమాకు సైతం మొదట అనిరుధ్ నే అనుకున్నారు. తరువాత ఏమైందో కానీ ఆ ప్లేస్ లోకి మిక్కీజే మేయర్ వచ్చి చేరాడు. కానీ ఈసారి త్రివిక్రమ్ తో సినిమా వదులుకోకూడదని అనిరుధ్ ఫిక్సయినట్లు ఉన్నాడు. పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ కమిట్ అయిన చిత్రానికి అనిరుధ్ నే అవకాశం వరించినట్లు టాక్. ఈ విషయాన్ని తన బర్త్ డే సందర్భంగా అనిరుధ్ మీడియాకు వెల్లడించాడు. తెలుగులో ఇదే తన అరంగేట్ర చిత్రమని చెప్పుకున్నాడు. దీంతో అభిమానులకు ఒక విషయం మీద క్లారిటీ వచ్చేసింది.. తప్పకుండా పవన్-త్రివిక్రమ్ కాంబో ఉండబోతుందని..
No comments:
Post a Comment