Tuesday, 11 October 2016

Sameday.. two Big Teasers

ఒకే రోజు... రెండు బిగ్ టీజర్లు..
తెలుగులో పీరియాడిక్ మూవీ టైం నడుస్తోంది. బాహుబలి సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. ఆ రూట్ లోనే వస్తుంది మరో సినిమా. కానీ ఆ సినిమా ఓ వెటరన్ హీరో బాలయ్య చేయడమే విశేషం. టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర టీజర్ ను దసరా స్పెషల్ గా రిలీజ్ చేశారు. టీజర్ అయితే అదిరిపోయింది. విజువల్స్.. బాలయ్య వాయిస్.. డైలాగులు.. టైటిల్ లాంచ్ అన్నీ బాగున్నాయి. అయితే ఇదేరోజు మరో ఇంట్రస్టింగ్ టీజర్ కూడా వచ్చింది. అదే రామ్ చరణ్ ధృవ.. దసరాకే విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల డిసెంబర్ కు వాయిదా పడింది. తమిళంలో తనిఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ చెప్పే డైలాగ్ బాగుంది. టీజర్ ను విజువల్స్ డామినేట్ చేసినా.. ఈ టీజర్ కెపాసిటీ మనకు తెలుస్తుంది. ఇలా ఒకేరోజు రెండు టీజర్లు సినీ అభిమానులను అలరించాయి. టీజర్ల కోసం ఈ లింక్ లను చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=ouXn5CK0wTU
https://www.youtube.com/watch?v=KkdRGomCHi8

No comments:

Post a Comment