Friday, 18 November 2016

Ekkadiki potavu chinnavada Review

ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ రివ్యూ: ఎంటర్ టైనింగ్ థ్రిల్లర్
రేటింగ్: 3.25/5
తారాగణం: నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత, అవికా గోర్, వెన్నెల కిషోర్, సత్య, ప్రవీణ్
గతవారం రొమాంటిక్ థ్రిల్లర్ అందించిన టాలీవుడ్ ఈ వారం ఎంటర్ టైనింగ్ థ్రిల్లర్ ను అందించింది. దెయ్యం కామెడీ కథలు.. టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఇది. అయితే అన్ని సినిమాల్లో దెయ్యం కామెడీ బ్యాచ్ ను కొట్టడం.. దానికో ఫ్లాష్ బ్యాక్.. కానీ ఈ సినిమాలో దెయ్యం కథనే డిఫరెంట్ గా చూపించడం మంచి రిలీఫ్.
ఇక కథలోకి వెళ్తే.. అర్జున్ (నిఖిల్) ఒకమ్మాయిని చూడకుండానే ప్రేమిస్తాడు. కానీ పెళ్లి జరిగే సమయానికి ఆమె రాకపోవడంతో..తను మోసం చేసిందని భావిస్తాడు. నాలుగేళ్ల తర్వాత అతను తన ఫ్రెండ్ కోసం కేరళ వెళ్తాడు. అక్కడ అమల (హెబ్బా)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ అంతలోనే కనపడకుండా వెళ్లిపోతుంది. అమల కోసం ఆమె ఊరుకూడా వెళ్తాడు.. కానీ అమల చనిపోయిందని తెలుస్తుంది. కట్ చేస్తే అమల రూపాన్నే పోలి ఉన్న నిత్య అనే అమ్మాయి కనిపిస్తుంది. అయితే అర్జున్ ని అదే తొలిసారి చూస్తున్నట్లు ప్రవర్తిస్తుంది.. ఇంతకీ అమల ఏమైనట్లు? నిత్య ఎవరు? ఇంతకీ అర్జున్ ప్రేమకథ ఏ తీరానికి చేరినట్లు? తెరపైనే చూడండి..
స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్యతో హిట్ ట్రాక్ పై ఉన్న నిఖిల్ ను శంకరాభరణం చిత్రం అమాంతం కిందకు దింపేసింది. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రం మళ్లీ నిఖిల్ కు మరో హిట్ అందించడం ఖాయంగా కనపడుతోంది. డిఫరెంట్ స్టోరీ.. ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది.. రెగ్యులర్ దెయ్యం కామెడీ కథల్లా కాకుండా దర్శకుడు డిఫరెంట్ గా చూపించడం కూడా ఎస్సెట్. నిఖిల్ తో పాటు ముగ్గురు హీరోయిన్లుగా నటించిన హెబ్బా, నందిత శ్వేత, అవికా గోర్ పాత్ర పరిధుల మేరకు నటించారు. హెబ్బా గ్లామర్.. నందిత శ్వేత అభినయం.. అవికా గోర్ అందం.. బాగున్నాయి. . వెన్నెల కిషోర్, సత్యల కామెడీ అదిరిపోయింది.
ఇక సాంకేతిక వర్గం విషయానికొస్తే శేఖర్ చంద్ర పాటల్లో రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎస్సెట్. టైగర్ సినిమా తర్వాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరోసారి రాణించాడు. ఒకరకంగా ఇది డైరెక్టర్స్ మూవీ అవుతుంది. సాయిశ్రీరాం ఫొటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు బాగున్నాయి. ఆరంభంలో మొదలై… బ్రేక్ అయిన కథను మళ్లీ కలిపిన దర్శకుడి తీరు ఆకట్టుకుంటుంది.
కొసమెరుపు: అమల అనే దేహంలో అయేషా అనే ఆత్మ ఉందని... నిత్యకు ఎలా తెలుస్తుందో దర్శకుడు చూపలేదు. ఇక్కడే లాజిక్ మిస్ అయింది.. బహుశా ఎడిటింగ్ లో ఒక సన్నివేశం లేపేశారమో అనిపించింది.. ఓవరాల్ గా భయం కలిగించకుండా వచ్చిన కామెడీ థ్రిలర్ ఇది..
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: బిగ్ సినిమాస్ (screen-4), అమీర్ పేట

No comments:

Post a Comment