గ్యారేజ్ కు సాయం చేసిన వరుణుడు..
రిలీజ్ కు ముందు జనతా గ్యారేజ్ టీమ్ ను భయపెట్టిన ప్రకృతి.. ఎన్టీఆర్ నేచర్ లవర్ గా నటించిన సినిమాకు మాత్రం కరుణించింది. విడుదల రోజు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలేవీ కురవకపోవడం ఈ సినిమా టీమ్ ను ఊరటపరిచింది. అన్నీ కలిసొచ్చినా వరుణుడు కరుణించకపోతే మాత్రం జనతా గ్యారేజ్ కలెక్షన్స్ కు మాత్రం పెద్ద దెబ్బపడేది. ఇప్పటికే రెండు ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచి ఎన్టీఆర్ సినిమాకు సాయపడగా.. లేటెస్ట్ గా వరుణుడు కూడా సినిమాను కరుణించాడు. దీంతో పోటీ సినిమాలేవీ లేకపోవడంతో ఎన్టీఆర్ కలెక్షన్స్ సునామీ సృష్టించే అవకాశం దక్కింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా జనతా గ్యారేజ్ రూ.15-20 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.
No comments:
Post a Comment