కాజల్.. ఎన్టీఆర్ లక్కీహ్యాండ్..!!
బృందావనం.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారే కాజల్, సమంత.. సినిమా ఫలితం సూపర్ హిట్. ఆ సమయంలో కాజల్, సమంత లక్కీ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో చెలామణి అవుతున్నారు. ఎన్టీఆర్ కాజల్, సమంతలతో మూడేసి సినిమాలు చేశాడు. బృందావనం తర్వాత సమంతతో రామయ్య వస్తావయ్యా, రభస.. కాజల్ తో బాద్ షా, టెంపర్ సినిమాలు చేశాడు. సమంతో చేసిన సినిమాలు డిజాస్టర్లు కాగా.. కాజల్ తో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. అయితే మరోసారి సమంతతో జనతా గ్యారేజ్ సినిమా చేశాడు ఎన్టీఆర్. సినిమా ఫలితం మీద ఏ మూలనో ఉన్న అనుమానంతో చిత్ర టీమ్ ఒక ఐటంసాంగ్ ను కావాలనే సినిమాలో ఇరికించారు. అదే పక్కాలోకల్ సాంగ్. జనరల్ గా అయితే నడుం తిప్పే పాటల్లో తమన్నాను మించినవారు ఇంకొకరు ఉండరు. కానీ తమన్నాతో ఎన్టీఆర్ కు ఊసరవెల్లి అనే ఫ్లాప్ ఉంది. అందుకే తనకు లక్కీ హీరోయిన్ అయిన కాజల్ తో జనతా గ్యారేజ్ లో ఐటంసాంగ్ పెట్టించారు. ఫలితం.. కథ, కథనాలు నీరసంగా ఉన్న సినిమా.. హిట్ రేంజ్ లో దూసుకెళుతోంది. ఈ ఫలితాన్ని చూసిన ఫిల్మ్ నగర్ ప్రజలు కాజల్ మరోసారి ఎన్టీఆర్ కు లక్కీ హీరోయిన్ అని ముక్తకంఠంతో చెప్తున్నారు. సో కాజల్ తో మరోసారి ఎన్టీఆర్ జతకట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.
No comments:
Post a Comment