Sunday, 4 September 2016

Janatha garage..3 Days.. 40 crores share..

3 రోజుల్లో 40 కోట్ల షేర్ రాబట్టిన జనతా గ్యారేజ్
కొరటాలశివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకెళ్తోంది. టెంపర్, నాన్నకు ప్రేమతో తర్వాత జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ హిట్ ను ఎన్టీఆర్ అందుకున్నాడు. తొలిరోజు డివైడ్ టాక్ తో మొదలైనప్పటికీ బరిలో మంచి సినిమాలేవీ లేకపోవడంతో సినీజనాలకు జనతా గ్యారేజ్ మంచి ఛాయిస్ అయింది. దీంతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను దుమ్ముదులేపిస్తున్నాడు. లాంగ్ వీకెండ్ రావడంతో తొలి మూడు రోజుల్లో రూ.75 కోట్లకు పైగా గ్రాస్.. రూ.40 కోట్ల షేర్ ను జనతాగ్యారేజ్ రాబట్టింది. నైజాంలో రూ.15 కోట్లకు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ జనతా గ్యారేజ్ హక్కులను కొనుక్కోగా.. 3 రోజుల్లోనే 9.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఫస్ట్ వీకెండ్ లోనే దిల్ రాజు సేఫ్ అయిపోతాడని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఓవర్సీస్ లో సైతం జనతా బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. 3 రోజుల్లోనే మిలియన్ మార్క్ ను జనతా దాటేసింది. ఓవరాల్ గా ఫస్ట్ వీక్ లో జనతా గ్యారేజ్ రూ.60 కోట్ల షేర్ రాబడుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment