ఇంకొక్కడు రివ్యూ: ఛియాన్ కు 'ఇంకో' ఫ్లాప్
రేటింగ్: 2.25/5
విక్రమ్ అంటే గెటప్ లకు మారుపేరు. ఇందులో మరోమాటకు ఆస్కారం లేదు. సౌతిండియాలో ఎవరు వేయలేని గెటప్పులతో విక్రమ్ అలరించాడు. శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ సినిమాలలో విక్రమ్ వేసిన గెటప్పులే వీటికి ఉదాహరణ. అయితే ఎన్ని గెటప్పులు వేస్తే ఏం లాభం.. ? స్టోరీలో దమ్ము లేనప్పుడు..!! ఈ విషయం విక్రమ్ కు ఎప్పుడు అర్ధమయితే అప్పుడు అతడు మరో హిట్ ఇవ్వగలడు.
ఇక కథ విషయానికొస్తే లవ్ అనే సైంటిస్ట్ స్పీడ్ అనే ఓ డ్రగ్ కనిపెడతాడు. ఆ డ్రగ్ ను మిస్ యూజ్ చేసుకోవాలని ప్రయతిస్తుంటాడు. అతడి కార్యకలాపాలను కనిపెట్టేందుకు ఇంటెలిజెన్స్ అధికారి అఖిల్ ప్రయత్నిస్తుంటాడు. ఆయుషి సహకారంతో ఈ విషయమై మలేషియా బయలుదేరుతాడు. అయితే అప్పటికే అఖిల్ తన భార్య ప్రాణాలను పొగొట్టుకుని ఉంటాడు. ఇంతకీ మలేషియా వెళ్లిన అఖిల్.. లవ్ ను అడ్డుకున్నాడా? లవ్ వల్ల అఖిల్ కు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడన్నది మిగతా కథ.
ఇంకొక్కడు సినిమాకు విక్రమే కర్మ, క్రియ, కర్త. రెండు డిఫరెంట్ పాత్రల్లో విక్రమ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. హిజ్రా పాత్రలో విక్రమ్ తన విశ్వరూపం చూపాడు. అయితే సెకండాఫ్ లో లవ్ పాత్రను తేల్చివేయడంతో కథ బోరింగ్ గా తయారైంది. మీరా పాత్రలో నయనతార ఓకే కానీ.. నిత్యమీనన్ ఈ మధ్య చిన్నచిన్న పాత్రలను ఎందుకు ఒప్పుకుంటుందో అర్ధంకావడంలేదు. ఈ ఏడాది నిత్య చేసిన మరో వేస్ట్ సినిమాగా ఈసినిమాను చెప్పుకోవచ్చు. దర్శకుడు ఆనంద్ శంకర్ ఆలోచన బాగానే ఉన్నా.. అది కథనంలోకి వచ్చేసరికి వంటకం కుదరలేదు. ఫస్టాఫ్ ఏదోలా మేనేజ్ చేసినా సెకండాఫ్ లో చెప్పడానికి ఏమీ మిగల్లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటే సినిమాలో ఉన్న హైలైట్. హారిజ్ జైరాజ్ పాటలు కూడా అంత సూపర్బ్ గా ఏమీలేవు. నేపథ్య సంగీతం ఓకే. ఆర్.డి.రాజశేఖర్ ఫొటోగ్రఫీ బాగుంది. సినిమా చాలా రిచ్ గా ఉంది.
ఓవరాల్ గా ఇంకొక్కడు సినిమా కొంచెం ఆసక్తిరేపినా.. అంచనాలను అందుకోలేక చతికిలపడింది. విక్రమ్ ఒక్కడే ఈ సినిమాను కాపాడగలడు అనుకుంటే.. అత్యాశే..!!
A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: ఏషియన్ లక్ష్మికళ (మూసాపేట)
No comments:
Post a Comment