Tuesday, 6 September 2016

Premam catch Druva Release date

'ధృవ' రిలీజ్ డేట్ కొట్టేసిన 'ప్రేమమ్'
దసరా బరి నుంచి రామ్ చరణ్ సినిమా ధృవ తప్పుకుంది. అక్టోబర్ నెల సెంటిమెంట్ రామ్ చరణ్ ను వేధిస్తుండటంతో వాయిదా తప్పడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా అక్టోబర్ నెలలోనే వస్తున్న రామ్ చరణ్.. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ ఫలితాలతో దారుణంగా నష్టపోయాడు. బయ్యర్లకు కూడా భారీ నష్టాలు తప్పలేదు. ముచ్చటగా మూడోసారి ధృవ సినిమాను కూడా అక్టోబర్ లోనే తేవాలని నిర్ణయించారు. కానీ ఈ నిర్ణయాన్ని డిస్ట్రిబ్యూటర్లు ఎంతమాత్రం ఒప్పుకోవపోవడంతో ధృవ టీమ్ వెనక్కు తగ్గింది. ‘ధృవ’ వాయిదా పడిపోవడంతో ‘ప్రేమమ్’ రిలీజ్ డేట్ ను ప్రిపోన్ చేశారు. అక్టోబరు 8న కాకుండా 7నే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపాడు.
అక్టోబర్ 7న విడుదలకావాల్సిన ‘ధృవ’ వాయిదా పడటంతో వీకెండ్ అడ్వాంటేజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. దసరాకు ఇంకా చాలా సినిమాలు రేసులో ఉన్నప్పటికీ.. ‘ప్రేమమ్’ ఫస్ట్ ఛాయిస్ అవుతుందని అంచనా. ప్రస్తుతం రేసులో ఉన్నవాటిలో పెద్ద సినిమా.. అత్యధిక అంచనాలున్న చిత్రం ఇదే. సెప్టెంబరు 20న ఆడియో వేడుకను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి

No comments:

Post a Comment