ఒకసారి ఇటు చూడవే అంటున్న నాగచైతన్య
నాగచైతన్య నటించిన రెండు సినిమాలు సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రేమమ్ అయితే దసరా బరిలో విడుదలవుతుందని ఇప్పటికే తేలిపోయింది. సాహసం శ్వాసగా సాగిపో డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే మరో సినిమాకు నాగచైతన్య రెడీ అయిపోయాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నాగచైతన్యతో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు ఒకసారి ఇటుచూడవే అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ చాలా క్యాచీగా ఉండటంతో జనాలకు ఈజీగా నోట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. అయితే ఒకసారి ఇటు చూడవే అని నాగచైతన్య ఎవరిని అంటాడో చూడాలి. రొమాంటిక్ జోనర్ లో ఈ చిత్రం రూపొందుతుందని టైటిల్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment