చైతూ, అఖిల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?
నాగచైతన్య, సమంత ఇద్దరూ పెళ్లిచేసుకుంటున్నారని అన్ అఫీషియల్ గా ఫిల్మ్ నగర్ కోడైకూస్తోంది. ఇక నాగ్ చిన్నకొడుకు అఖిల్ కూడా చిన్ననాటి స్నేహితురాలు శ్రేయాభూపాల్ ను పెళ్లాడబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే వీరి పెళ్లిళ్లు ఎప్పుడన్నది నాగ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం నిర్మలా కాన్వెంట్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని డేట్ ఫిక్స్ చేస్తామని నాగార్జున మీడియాకు వెల్లడించారు.
లేటెస్ట్ టాక్ ఏంటంటే చైతూ, అఖిల్ ఇద్దరి పెళ్లిళ్లు ఈ ఏడాది లేవనే అర్ధమవుతోంది. ఇద్దరు హీరోలు కెరీర్ పై దృష్టి సారించారని.. చైతూ... కళ్యాణ్ కృష్ణతో, అఖిల్..విక్రమ్ కె కుమార్ సినిమాలతో బిజీ అవుతున్నారని నాగార్జున చెప్తున్నారు. చైతూ కూడా ఇప్పుడే పెళ్లి వద్దంటున్నాడట. అఖిల్ నిశ్చితార్ధం అయితే ఈ ఏడాది డిసెంబర్ తొలివారంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఏదైమైనా కోలీవుడ్ , బాలీవుడ్ ల్లో ప్రేమ వ్యవహారాల్లా చైతూ-సమంత లవ్ ట్రాక్ కాకూడదని కోరుకుందాం.
No comments:
Post a Comment