Tuesday, 13 September 2016

Southindia 100 Crores collection movies

సౌతిండియాలో రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాలు
హ్యాట్రిక్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న జూ.ఎన్టీఆర్ మరో రికార్డు సాధించేశాడు. ఇప్పటివరకు రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలనుకున్న ఎన్టీఆర్.. దానికి రెట్టింపు కలెక్షన్స్ వసూలు చేసి వారెవ్వా అనిపించాడు. జనతా గ్యారేజ్ లో కంటెంట్ అంతగా లేనప్పటికీ.. ఈ సినిమా రిలీజైన టైమింగ్ తో రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు యంగ్ టైగర్. అయితే తెలుగులో ఇంతకుముందే రూ.100 కోట్లను పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సాధించారు. పవన్ ఈ ఫీట్ ను రెండు సార్లు సాధించగా.. మిగతా హీరోలు ఒక్కోసారి ఈ ఫీట్ లోకి చేరారు. తాజాగా జూ.ఎన్టీఆర్ ఈ క్లబ్ లోకి రంగప్రవేశం చేశాడు. సౌతిండియాలో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితా చూస్తే..
1) బాహుబలి (తెలుగు, హిందీ, మలయాళం) - రూ.600 కోట్లు
2) కబాలి (తమిళం, తెలుగు, హిందీ, మలయాళం) - రూ.300 కోట్లు
3)రోబో (తమిళం, తెలుగు, హిందీ)-రూ.289 కోట్లు
4)శంకర్ ఐ (తమిళం, తెలుగు, హిందీ)-రూ.239 కోట్లు
5) శివాజీ (తమిళం, తెలుగు, హిందీ)-రూ.155 కోట్లు
6)లింగా (తమిళం, తెలుగు, హిందీ)-154 కోట్లు
7)మగధీర (తెలుగు, తమిళం, మలయాళం)-రూ.150 కోట్లు
8)శ్రీమంతుడు (తెలుగు, తమిళం)-రూ.144 కోట్లు
9)తేరి (తమిళం, తెలుగు)-రూ.143 కోట్లు
10)అత్తారింటికి దారేది (తెలుగు, హిందీ)-రూ.131 కోట్లు
11)సరైనోడు (తెలుగు, మలయాళం)-రూ.127 కోట్లు
12)తుపాకీ (తమిళం, తెలుగు, హిందీ)-రూ.125 కోట్లు
13) కత్తి (తమిళం)- రూ.125 కోట్లు
14) సింగం-2 (తమిళం, తెలుగు)-రూ.122 కోట్లు
15)వేదాలం (తమిళం)-రూ.120 కోట్లు
16) గంగ (కాంచన-2) (తమిళం, తెలుగు)-రూ.113 కోట్లు
17)విశ్వరూపం (తమిళం, తెలుగు, హిందీ)-రూ.108 కోట్లు
18) గబ్బర్ సింగ్ (తెలుగు) - రూ.104 కోట్లు
19) జనతా గ్యారేజ్ (తెలుగు, మలయాళం)-రూ.102 కోట్లు (రన్నింగ్)

No comments:

Post a Comment