పెళ్లిచూపులు సినిమా చూసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ ఓ ఐకాన్ లాంటివారు. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ఇటు సినిమాలపైనా మక్కువ చూపుతారు. సినీ రంగానికి సన్నిహితంగా ఉండే కేటీఆర్.. మంచి సినిమాలను చూస్తూ.. వాటిపై తన అభిప్రాయాలను అనుచరులతో, అభిమానులతోను పంచుకుంటూ ఉంటారు.
రీసెంట్ గా చిన్న మూవీగా రిలీజై.. పెద్ద హిట్ సాధించిన పెళ్లి చూపులు చిత్రాన్ని.. కేటీఆర్ చూశారు. ఆయన కోసం స్పెషల్ షో వేయగా.. ఈ మూవీ కంటెంట్ కేటీఆర్ కు విపరీతంగా నచ్చేసింది. సినిమా చూసిన కాసేపటికే.. పెళ్లిచూపులు చిత్రంపై తన ఒపీనియన్ ని తెలిపారు కేటీఆర్. పెళ్లిచూపులు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని.. కొత్త తరహా అనుభూతినిచ్చిందని.. తరుణ్ అండ్ టీమ్ కి హ్యాట్సాఫ్ తెలిపారు. ఎలాంటి నీతులు చెప్పకుండా పెళ్లి చూపులు ఆకట్టుకుంటుంది. అసాధారణమైన ప్రొఫెషన్స్.. మహిళా సాధికారికత.. ఇంట్రప్రెన్యూర్లుగా మారాలనే స్ఫూర్తి రగిలించడం.. అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
ఇప్పటికే సినీ రంగంలోని పలువురు స్టార్లు, సెలబ్రిటీలు ముక్త కంఠంతో పెళ్లిచూపులు చిత్రాన్ని పొగుడుతుండటంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు కేటీఆర్ లాంటి క్రేజ్ ఉన్న పొలిటీషియన్ ట్వీట్ తో.. ఈ మూవీ వసూళ్లు మరో మెట్టెక్కడం ఖాయమే అని చెప్పచ్చు.
No comments:
Post a Comment