సాయి ధరమ్ తేజ్ దగ్గర డబ్బులు లేవా??
మెగా క్యాంప్ లో హీరోలకు ఇమేజ్ విషయంలో ఢోకా లేదు. కానీ సాయి ధరమ్ తేజ్ పరిస్థితి వేరంట.. రేయ్ సినిమాకు విడుదల విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. రెండేళ్ల తర్వాత కానీ ఆ సినిమా విడుదల సాధ్యం కాలేదు. అప్పుడు తేజూకి వచ్చిన మరో అవకాశమే తిక్క సినిమా అని తెలిసింది. కేవలం అడ్వాన్స్ కోసం తేజూ ఆ సినిమా ఒప్పుకున్నాడని సమాచారం. కథ లైన్ కూడా సరిగ్గా వినకుండా తిక్క సినిమాకు పచ్చజెండా ఊపాడు తేజూ. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు.
రేయ్ తర్వాత దిల్ రాజు సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేసినా వాటికి సంబంధించిన డబ్బులు సరైన టైంలో రాకపోవడంతో తేజూ తిక్క సినిమా ఒప్పుకున్నాడు. ఆర్ధికంగా గొప్ప ఫ్యామిలీనే అయినా వాళ్లను డబ్బులు అడగటం ఇష్టంలేకే తేజూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు వరుసగా రెండు సక్సెస్ ల తర్వాత తేజూ తిక్క సినిమా తేజూ కెరీర్ కు పెద్ద దెబ్బే వేసేసింది. ఫెయిల్యూర్ వచ్చిన ఫర్వాలేదనే నిర్ణయంతోనే తేజూ తిక్క సినిమా ఫినిష్ చేశాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.
No comments:
Post a Comment