ప్రీమియర్లతోనే జనతా గ్యారేజ్ రికార్డులు
ఇచట అన్ని రిపేర్లూ చేయబడును అంటున్నాడు ఎన్టీఆర్... తన జనతా గ్యారేజ్`సినిమాతో.. కానీ ఆయన అభిమానులు మాత్రం `ఇచట అన్ని రికార్డులూ తిరగ రాయబడును` అని ధీమాగా చెప్పుకొంటున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎన్టీఆర్ అభిమానుల మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అమెరికాలో జనతా గ్యారేజ్ ప్రీమియర్లు, అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే 80 వేల డాలర్లు వసూళ్లొచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ రావొచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓవర్సీస్ ప్రీమియర్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు వచ్చే వసూళ్ల విషయంలో రికార్డులు ఆశిస్తున్నారు. మరి ఎన్ని రికార్డులు తిరగరాయబడతాయో చూడాలి. ఎన్టీఆర్ మాత్రం చాలా ఈ సినిమా ఫలితంపై చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతున్నాడు.
No comments:
Post a Comment