Monday, 29 August 2016

BOLLYWOOD DOP WITH BUNNY MOVIE

బన్నీ సినిమాకు బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్
దిల్ రాజు బ్యానర్ మరో చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఈ సారి విశేషం ఏంటంటే దిల్ రాజు బ్యానర్ కు ఇది 25వ చిత్రం కావడం.హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా నటించే ఈ చిత్రానికి ‘డీజే – దువ్వాడ జగన్నాథం’ అనే టైటిల్ ఖరారు చేశారు.
సినిమా మేకింగ్ పరంగా ఏమాత్రం రాజీపడని దిల్ రాజు ఈ చిత్రం సినిమాటోగ్రఫీ కోసం బాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరిని ఎంచుకున్నారు. అతనే అయనాంక బోస్. గతంలో అయనాకంక బోస్ ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్, కైట్స్, కిక్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. కనుక బోస్ బన్నీ సినిమాకి ఖచ్చితంగా ఇంప్రెసివ్ లుక్ ఇస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

No comments:

Post a Comment