Monday, 29 August 2016

RAJANIKANTH AGAIN WITH KABALI DIRECTOR

కబాలి దర్శకుడితో మరోసారి రజనీకాంత్
రజనీకాంత్ మరోసారి కబాలి డైరెక్టర్ తో జతకట్టనున్నారు. రోబో 2.0 తర్వాత రజనీకాంత్ పా.రంజిత్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించనున్నారు. రజనీ అల్లుడు, హీరో ధనుష్ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఈ సినిమా తన బ్యానర్‌లోనే ఉంటుందని ప్రకటించాడు ధనుష్. వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తాడని ధనుష్ పోస్ట్ చేశాడు.
‘కబాలి’ సినిమాతో రజనీకి ఎలాగైనా తిరుగులేని హిట్ వస్తుందని ఆశించిన అభిమానులను పా రంజిత్ నిరాశపరిచిన విషయం విదితమే. ఇప్పుడు అదే పా రంజిత్‌కు రజనీ మరో అవకాశం ఇవ్వడం ఇక్కడ ఆసక్తికర అంశంగా చెప్పుకోవాలి. కబాలికి సీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుందేమో అన్న ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతానికి రోబో 2.0 పూర్తవ్వడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున రజనీ ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా తన స్టైల్లో పా.రంజిత్ కథను పూర్తి చేస్తున్నారట.

No comments:

Post a Comment