బాబోయ్.. బ్రహ్మోత్సవం.. 100 రోజులా..??
బ్రహ్మోత్సవం సినిమా ఫైనల్ రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అసలు విశేషం ఏంటంటే బ్రహ్మోత్సవం 100 రోజులు ఆడటం...కాకపోతే చాలా సెంటర్లలో ఏం కాదు. చిలకలూరిపేటలోని విశ్వనాథ్ థియేటర్లో ఈ చిత్రం రోజుకు 4 ఆటలతో వంద రోజులు ఆడటం విశేషమే. మరి వంద రోజులు ఆడేంత సినిమానా ఇది అంటే మాత్రం ఏం చెప్పలేం. సూపర్ స్టార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.
మహేష్ బాబు హీరోగా నటించిన 22 సినిమాల్లో 18 డైరెక్టుగా శత దినోత్సవం జరుపుకున్నాయని.. అందులో ‘బ్రహ్మోత్సవం’ కూడా ఒకటని బీఏ రాజు వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. బ్రహ్మోత్సవం 100 రోజుల వేడుక జరుపుకుంటున్న రోజే.. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో మైలురాయి అనదగ్గ ‘మోసగాళ్లకు మోసగాడు’ 45 వసంతాలు పూర్తి చేసుకుందట. యాధృచ్ఛికంగా ఈ రెండూ కలిసి రావడం మంచి విషయమే కానీ.. ‘బ్రహ్మోత్సవం’ హిట్ అనిపించుకుని 100 రోజుల వేడుక చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ‘బ్రహ్మోత్సవం’ చిలకలూరి పేటలో వంద రోజులు ఎలా పూర్తి చేసుకుంది.. జనాలు ఎలా ఆదరించారన్నది అక్కడి వాళ్లకే తెలియాలి. సినిమాకు మొదట్లో ఎలాంటి టాక్ వచ్చింది.. ఎంత కలెక్షన్ వచ్చింది.. ఫైనల్ రిజల్ట్ ఏంటి అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరమైతే లేదు.

No comments:
Post a Comment