సమంత నీకు.. హ్యాట్సాఫ్..!!
సమంత అనగానే తెరపై నటించే ఓ బ్యూటీ హీరోయిన్ అని మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అందరికీ తెలిసిన హీరోయిన్ సమంత వేరు కొందరికి మాత్రమే తెలిసిన ప్రత్యూష ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు వేరు. ఎంతో అందాన్ని ఇచ్చిన దేవుడు ఆమెకు అంతే అందమైన మనసును కూడా ఇచ్చాడు. ఎందుకంటే... ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలు అలాంటివి మరి. ప్రచారం కోసమో, ఫోటోల కోసమని కాకుండా లక్షలు ఖర్చు పెట్టి ఎందరో అభాగ్యులైన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది సమంత.
ఈమధ్య ఒక ప్రమాదంలో కాలు కోల్పోయింది భవానీ అనే చిన్నారి! రీసెంట్ గా హైదరాబాద్ లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో ఉన్న ఆ చిన్నారి భవానిని సమంత కలిసింది. సెల్ఫీలు దిగడమో, నాలుగు కబుర్లు చెప్పి అక్కడ నుండి వెళ్లిపోలేదు సమంత. భవానీతో చాలా సేపు గడిపిన అనంతరం ఆమె కోసం కృత్రిమ కాలు అమర్చటానికి అన్ని ఏర్పాట్లూ చేయించేసింది. దీంతో ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఈ ఐదేళ్ల చిన్నారికి కృత్రిమ కాలు అమర్చారు. డాక్టర్లు ఈ శస్త్ర చికత్సను విజయవంతంగా పూర్తి చేశారు ఫలితంగా... ఈ చిన్నారికి మళ్లీ నడిచే భాగ్యం కల్పించింది సమంత.
అయితే సమంత ఇలా చేయటం ఇదే మొదటి సారి కాదు. గత కొన్నేళ్ళుగా కొన్ని కోట్ల రూపాయలను విరాళాల రూపంలో ఎందరికో సహాయం చేస్తోంది. ఇప్పటివరకూ సమంత అందాన్ని మాత్రమే ఆరాధించిన వారంతా ఇప్పుడు ఆమె గొప్ప మనసుకు కూడా హ్యాట్సాఫ్ చెబుతారు.. మీరేమంటారు?

No comments:
Post a Comment