Tuesday, 23 August 2016

JANATHA GARAGE RELEASE DATE CHANGED

జనతా గ్యారేజ్.. మళ్లీ డేట్ మారింది..!!

అందరూ అనుకున్నట్లే జనతా గ్యారేజ్ విడుదల తేదీ మారింది. అయితే అభిమానులెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. జనతా గ్యారేజ్ సినిమా మళ్లీ వాయిదా పడలేదు. ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 1వ తేదీనే అభిమానులను అలరించడానికి వచ్చేస్తోంది. ముందుగా షెడ్యూల్ చేసుకున్న సెప్టెంబర్ 2 తేదీన బంద్ జరుగుతుందన్న వార్తలతో కంగారుపడ్డ చిత్రబృందం.. ఒకరోజు ముందు వస్తే నష్టమేమీ ఉండదుగా అన్నకున్నట్లుంది. అందుకే గురువారమైన సెప్టెంబర్ 1నే ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ రిలీజ్ డేట్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 5 సోమవారం వినాయకచవితి హాలీడే ఉండటంతో 5 రోజుల లాంగ్ వీకెండ్ ఎన్టీఆర్ కు కలిసిరాబోతుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు 5 రోజులు బాక్సాఫీస్ ను దుమ్ముదులిపే అవకాశం ఎన్టీఆర్ కు కలిసిరానుంది. 

No comments:

Post a Comment