జనతా గ్యారేజ్ ఆడియో రివ్యూ
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల విజయాలతో టాప్ గేర్ లో ఉన్న ఎన్టీఆర్.. హ్యాట్రిక్ విజయానికి సన్నద్ధమవుతున్నాడు. అతడు నటించిన జనతా గ్యారేజ్ పాటలు మార్కెట్లోకి విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో కమర్షియల్ సినిమాలను మరో రేంజ్ కు తీసుకెళ్లిన కొరటాల జనతా గ్యారేజ్ తోనూ మరో మెట్టు ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
జనతా గ్యారేజ్ ఆడియోలో పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి రాశారు. ఇందులో ఆరు పాటలు ఉన్నాయి.తొలి పాట.. ప్రణామం.. ప్రణామం సాంగ్. ఈ సృష్టిలోని ప్రతి అంశానికి ప్రణామం తెలుపుతూ ఈ పాట సాగుతుంది. మంచి బీట్ తో సాగే ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు.ఈ పాట యువతను ఉర్రూతలూగిస్తోంది. రెండో పాట.. రాక్ అండ్ రోల్ అంది సెలవు రోజు.. దొరికిన విశ్రాంతి సమయాన్ని ఎలా గడపాలో తెలుపుతూ ఈ పాట ఉంది. రఘు దీక్షిత్ వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. మూడో పాట.. దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ అంటూ హీరోయిన్ అందాన్ని పొగుడుతూ యాజిన్ నీజర్ పాడిన పాట ఫాస్ట్ బీట్ తో సాగుతుంది. నాలుగో పాట..జయహో జనతా టైటిల్ కు జస్టిఫికేషన్ ఇస్తూ సుఖ్వీందర్ సింగ్ పాడిన పాట ఎమోషనల్ గా సాగుతుంది. ఐదో పాట.. నీ సెలవంటూ నే వెళ్లిపోతున్నా అంటూ శ్వేతామోహన్ పాడిన పాట సందర్భోచితంగా ఉంది. బహుశా నిత్యామీనన్ తో ఈ పాట ఉండొచ్చు. ఇక ఈ ఆడియోలోనే అత్యంత హుషారైన సాంగ్ ఆరో పాట నేను పక్కా లోకల్ అంటూ గీతామాధురి ఆలపించిన పాట మాస్ జనాన్ని ఉర్రూతలూగించడం ఖాయంగా కనపడుతోంది. ఓవరాల్ గా దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతాన్ని అందించాడు. కొరటాల గత చిత్రాల స్థాయిలో ఆడియో లేకున్నా సినిమా విడుదలైన తర్వాత మరింత జనాల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.
Good Review
ReplyDelete