Wednesday, 24 August 2016

HEROES FIGHTING FOR DUSSERA SEASON

దసరా కోసం కొట్టుకుంటున్న హీరోలు

టాలీవుడ్ కు సంక్రాంతి, దసరా ముఖ్యమైన పండుగలని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే షూటింగ్ ప్రారంభించినప్పుడే సంక్రాంతికో, దసరాకో మా సినిమా రిలీజ్ అని నిర్మాతలు ప్రకటనలు ఇచ్చేస్తుంటారు. ఒక్కోసారి ఈ పండుగలకు నాలుగేసి, ఐదేసి సినిమాలు విడుదలై ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి కూడా నాలుగు చిత్రాలు రిలీజై అన్నీ ఆదరణ పొందాయి. దసరాకు కూడా ఈ సీన్ రిపీటయ్యేలానే ఉంది.రామ్ చరణ్ ధృవ, రామ్ హైపర్, గోపీచంద్ ఆక్సిజన్, నాగచైతన్య ప్రేమమ్, కళ్యాణ్ రామ్ ఇజం దసరా బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ పెద్ద చిక్కు వచ్చేలా ఉంది. సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల్లో రెండు పెద్ద సినిమాలు, ఒక మీడియం సినిమా, ఒక లోబడ్జెట్ మూవీ ఉన్నాయి కాబట్టి థియేటర్లకు లెక్క సరిపోయింది. కానీ దసరా బరిలో నిలిచే చిత్రాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. రామ్ చరణ్ మినహాయిస్తే మిగతా హీరోలందరూ మీడియం రేంజ్ అయినా వారి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. సెప్టెంబర్ 29న రామ్ హైపర్ తో ప్రారంభమయ్యే ఈ సునామీ వరుస వారాలలో ఇజం, ధృవ, ఆక్సిజన్, ప్రేమమ్ లతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఈ సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడనుంది. ఈరోజుల్లో బడ్జెట్ రికవరీ చేసుకోవాలంటే మినిమం 700 థియేటర్లకు పైగా రిలీజ్ చేసుకోవాల్సిందే. లేకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదముంది. సో వెయిట్ అండ్ సీ..  ఏ సినిమా ఎక్కువ థియేటర్లు దక్కించుకుంటుందో.. ఏ సినిమా థియేటర్లు దొరక్క చతికిలపడుతుందో..??

No comments:

Post a Comment