ఎన్టీఆర్ తో కాజల్ అగర్వాల్ ఐటంసాంగ్..
జూ.ఎన్టీఆర్, దేవిశ్రీప్రసాద్.. ఈ కాంబినేషన్ అంటే శ్రోతలకు వీనులవిందు ఖాయం. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పటికే నా అల్లుడు, రాఖీ, అదుర్స్, ఊసరవెల్లి, నాన్నకు ప్రేమతో సినిమా పాటలతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. తాజాగా జనతా గ్యారేజ్ తో మరోసారి పాటలతో మాయ చేస్తున్నారు. ఈ ఆల్బమ్ లో నేను పక్కాలోకల్ అంటూ గీతామాధురి పాడిన సాంగ్ మాస్ లోకాన్ని ఊపేస్తోంది. ఈ పాటకు చిందేసింది ఎవరో కాదు.. ఎన్టీఆర్ తో బెస్ట్ పెయిర్ అనిపించుకున్న కాజల్ అగర్వాలే. బృందావనం, బాద్ షా, టెంపర్ లతో హ్యాట్రిక్ కాంబినేషన్ గా పేరుతెచ్చుకున్న ఎన్టీఆర్, కాజల్ మరోసారి జతకట్టారు. పక్కాలోకల్ అంటూ కాజల్ ఎన్టీఆర్ తో డ్యాన్సులు వేసిందట. అసలే డాన్సుల్లో తారక్ మహా ఘనపాటి. మరి కాజల్ ఎలా చిందేసిందో చూడాలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే.
No comments:
Post a Comment